ADVT: ఈ పసి పిల్లల ప్రాణాలు దక్కాలంటే..

31 May, 2022 14:27 IST|Sakshi

పెళ్లైన చాన్నాళ్లకు తల్లిని కాబోతున్నానే వార్త తెలియగానే గాలిలో తేలినట్టుగా అనిపించింది. శుభవార్త తెలిసన మరుక్షణం నుంచి క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లూ పరీక్షలు చేయించుకునే దాన్ని. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లలను అపురూపంగా చూసుకోవాలని నా భర్త కలలు కనేవాడు. ఒక్కరోజు పని మానేసేట్టుగా మా ఆర్థిక పరిస్థితి లేకపోయినా.. నా కోసం, రాబోయే పసివాళ్ల కోసం పనులు మానుకుని ఇంటి దగ్గర ఉన్న రోజులు ఉన్నాయి.

ఎప్పుడెప్పుడు నా బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని కలలు కంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఉ‍న్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. క్షణాల్లోనే నిభాయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కంగారు పడిన నా భర్త వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నా చుట్టూతా డాక్టర్లు, నర్సులు వచ్చి చేరారు. క్రమంగా కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియడం లేదు. కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను. కవలలు పుట్టారని చెప్పారు. కానీ...

నెలలు నిండకుండానే కవలలు జన్మించడంతో ఇద్దరి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన చిన్నారులను ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం మొదలు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. వారి ఆరోగ్యం సాధారణ స్థితికి రావాలంటే నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స అందివ్వాలని చెప్పారు. దీని కోసం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు.

సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. పిల్లల ఆస్పత్రి ఖర్చులకు సరిపడా డబ్బులు సమకూర్చుకోవడం మా వల్ల కాని పని. మరోవైపు వైద్య చికిత్స అందకపోతే కవలల ప్రాణాలకే ప్రమాదం. ఆలస్యం జరిగే కొద్ది వాళ్లు మృత్యు ఒడికి దగ్గరవుతున్నారనే ఆలోచనలతో నా తల్లిమనసు తల్లడిల్లుతోంది. దయచేసి నా పిల్లల ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. నా బిడ్డలకు మరుజన్మ ప్రసాదించండి. (అడ్వెర్‌టోరియల్‌)
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు