వరుసగా 16వ ఏట దాతృత్వం చాటుకున్న ‘పై ఇంటర్నేషనల్’

26 Jul, 2022 18:01 IST|Sakshi

బెంగళూరు: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్, వినియోగ ఉపకరణాల రిటైలర్, పై ఇంటర్నేషనల్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది.సీఎస్‌ఆర్‌ చొరవలో భాగంగా వరుసగా 16వ సంవత్సరం విద్యార్థులకు అండగా నిలిచింది. 1.1 లక్షల నోట్‌బుక్‌లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసింది.

విద్య-కేంద్రీకృత CSR కార్యకలాపాలను పురస్కరించుకుని తుమకూరులో 12,226 మంది విద్యార్థులకు 1.1 లక్షల నోట్‌బుక్‌లను ఉచితంగా పంపిణీ చేసింది. జూలై 4 తుమకూరులో జరిగిన ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో పై ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు ఎండీ  రాజ్‌కుమార్‌ విద్యార్థులకు పుస్తకాలను అందించారు. ఇంకా ఎఫ్‌డీ మీనా ఆర్ పాయ్, గురుప్రసాద్‌పై (డైరెక్టర్), పుష్పాపై (డైరెక్టర్), జయశ్రీ (డైరెక్టర్) ఇతర కీలక మేనేజ్‌మెంట్ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. సుమారు 15 పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

ఆర్థిక సంక్షోభం అనేక వ్యాపారాలను ప్రభావితం చేసిన ఈ అనిశ్చిత కాలంలో విద్యార్థులు, పాఠశాలలకు సమయానుకూలంగా అండగా నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. 2005లో పై ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు ఎండీ  రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిద్దగంగ మఠంలో ఈ పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంపెనీ, బ్రాండ్, రిటైల్ నెట్‌వర్క్‌ చాలా వేగంగా విస్తరించిందనీ, ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్‌ నేతృత్వంలో లక్ష మంది విద్యార్థులకు సాధికారత కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇప్పటివరకు 22,500 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని వెల్లడించింది.

గత 15 ఏళ్లుగా తుమకూరు,మైసూర్, ఉడిపి, మంగళూరు, కేరళ అంతటా పుస్తకాలను పంపిణీ చేస్తూ, విద్యార్థుల భవిష్యత్‌ విద్యావకాశాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని రాజ్‌కుమార్‌ తెలిపారు. ముఖ్యంగా ఆన్‌లైన్ తరగతుల  సమయాల్లో సాధనాలు, వనరులకు ప్రాప్యత అవసరమయ్యే అనేక మంది ఔత్సాహిక విద్యార్థుల విద్యా ప్రయాణంలో భాగమైనందుకు సంతాషాన్ని ప్రకటించారు. సమీప భవిష్యత్తులో ఆధునిక టెక్నాలజీ రాబోతున్న తరుణంగా వాటిని అందించేందుకు వీలుగా రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

విద్యావకాశాలను అందించడంలోనే కాదు, పర్యావరణం, సీనియర్ సిటిజన్ సంక్షేమ కార్యకలాపాలకు కూడా సాయాన్ని అందిస్తున్నారు రాజ్‌కుమార్‌. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 311 చెట్లను విజయవంతంగా నాటారు. అంతేకాదు వాటి సంరక్షించడంలో ఆయన ముందున్నారు. అలాగే నిరుపేద పిల్లలను దత్తత తీసుకొని విద్యను అందిస్తున్నారు. వీరిలో  33 మంది ఇప్పటివరకు లబ్ధిదారులుగా ఉండటం విశేషం. దీంతోపాటు 1000 మంది సీనియర్ సిటిజన్లకు అధిక నాణ్యత గల జీవన సౌకర్యాన్ని అందించడానికి రోడ్‌మ్యాప్‌ను వేయడంతో పాటు, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, దాని అవుట్‌లెట్‌ల దగ్గర మెరుగైన సౌకర్యాలను అందించడం కూడా బాధ్యత వహిస్తోంది.

కాగా రాజ్‌కుమార్‌ నేతృత్వంలో 2000లో సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైలింగ్‌ రంగంలో పై ఇంటర్నేషనల్‌ ఎంటరై విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా 200పైగా అద్భుతమైన షోరూమ్‌లను నిర్వహిస్తోంది.మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఐటీ, ఫర్నిచర్ ఉత్పత్తులను అందించే పై ఇంటర్నేషనల్‌ బెంగళూరు, హైదరాబాద్, హాసన్, చిక్కమగళూరు, షిమోగా, మంగళూరు, ఉడిపి, కుందాపూర్, భత్కల్, హుబ్లీ, బెల్గాం, చిత్రదుర్గ, మైసూర్, మాండ్యలలో ఔట్‌లెట్‌లను నిర్వహిస్తోంది.
(అడ్వర్టోరియల్‌)

గమనిక : sakshi.com నందు వచ్చే ప్రకటనలు అనేక దేశాలు, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుంచి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్తతో ఉత్పత్తులు లేదా సేవల గురించి విచారించి కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు/సేవల నాణ్యత, లోపాల విషయంలో సాక్షి యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈవిషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

మరిన్ని వార్తలు