ఇది చాలా సరళమైన ప్రక్రియ! (స్పాన్పర్డ్‌)

30 Sep, 2020 10:36 IST|Sakshi

మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రైవసీ కష్టాలన్నింటికీ శాంసంగ్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ సరైన సమాధానం. జనరేషన్ జడ్, మిలీనియల్స్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫీచర్లు యూజర్‌కు పూర్తి ప్రైవసీని అందించడమే కాకుండా మనశ్శాంతిని అందిస్తాయి. పూర్తి వివరాలను పరిశీలిద్దాం..

ఫీచర్ భాగస్వామి : హెచ్టీ బ్రాండ్ స్టూడియో
ఇలా ఊహించుకోండి : మీరు ఆఫీసులో ఉండగా మీ బాస్‌పై చేసిన మీమ్స్‌ను చూసేందుకు మీ కొలీగ్స్ మీ ఫోన్ చుట్టూ గుమికూడారు. మీతో సహా వారంతా ఆ మీమ్స్‌ చూసి నవ్వు ఆపుకోలేని పరిస్ధితి. హఠాత్తుగా మీ బాస్ అక్కడ ప్రత్యక్షం కావడంతో మీరు అచేతనంగా చూస్తుండిపోయారు. బాస్ నా ఫోన్ అడిగితే అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఏమవుతుంది? అని మీ మనసులో అలజడి రేపుతుంది. ఇలాంటి క్షణాల్లో మీమ్ కనిపించని వెర్షన్‌లోకి మారిపోయే ఫీచర్ మీ ఫోన్లో ఉండటం మీరు ఇష్టపడతారు కదా? దీన్ని మీకు మేం అందిస్తాం!

క్విక్ స్విచ్ : కేవలం డబుల్ క్లిక్‌తో మీ ప్రైవసీ పటిష్టం
క్విక్ స్విచ్ పేరిట శాంసంగ్ వినూత్నమైన ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌లో క్షణాల వ్యవధిలో ఫోటోలను ప్రైవేట్ నుంచి మెయిన్ గ్యాలరీకి తరలించవచ్చు. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడంతోనే ఈ వెసులుబాటు లభిస్తుంది. ఇది చాలా సరళమైన ప్రక్రియ!

ఈ ఫీచర్ నటి రాధికా మోహన్‌కు ఎలా ఉపయోగపడిందో చూద్దాం.
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై అందుబాటులో ఉన్న క్విక్ స్విచ్ వాట్సాప్, బ్రౌజర్, ఇతర యాప్ప్‌పైనా పనిచేస్తుంది.

దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడవచ్చు.
జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోరుకునే వెసులుబాటు, అవాంతరాలు లేని అనుభూతిని క్విక్ స్విచ్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇది మీ వ్యక్తిగత జీవితానికి రహస్య లాకర్‌గా మీరు భావించవచ్చు
ఫ్రెండ్ లేదా కొలీగ్‌కు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలంటే తటపటాయించే రోజులు పోయాయి. వారికి ఫోన్ ఇస్తే వారు నా కంటెంట్, చాట్లను చూస్తారు కదా ? అనే భయాలు యూజర్ మనసులో మెదిలేవి. వీటన్నింటికీ క్విక్ స్విచ్ సరైన సమాధానంగా ముందుకొచ్చింది.

మరోవైపు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ఉండే సెక్యూర్ ఫోల్డర్లో ఉండే ఆయా యాప్స్ ప్రైవేట్ వెర్షన్లను శాంసంగ్ నాక్స్ భద్రత కాపాడుతుంది. క్విక్ స్విచ్‌తో కూడిన మీ స్మార్ట్‌ఫోన్‌ను నిరభ్యంతరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఎవరికైనా ఇవ్వవచ్చు. మీ ఫోన్ లాక్ చేయడం మరిచిపోయినా భయపడాల్సిన పనిలేదు! మీ ప్రైవేట్ సమాచారాన్ని మీరు మినహా మరెవరూ చూడకుండా క్విక్ స్విచ్ కాపాడుతుంది.

ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ - మీకు అవసరమని మీరు ఊహించని వినూత్న ఆవిష్కరణ
శాంసంగ్ ప్రైవసీ వినూత్న ఫీచర్లకు జోడింపుగా ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో నిర్మితమైన ఏఐ ఫీచర్గా ఇది గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు పూర్తి ప్రైవసీని కల్పిస్తుంది. ముందుగా గుర్తించిన ఫోటోల ఆధారంగా ఆయా ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్‌కు ఇది తరలిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియో వీక్షించండి
మీరు మీ సోదరికి చెప్పకుండా హాజరైన పార్టీకి సంబంధించిన ఫోటోలను ఆమె కంటపడటం నుంచి ఈ ఫీచర్ మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది.

మధ్యశ్రేణి సెగ్మెంట్‌ను బలోపేతం చేసిన శాంసంగ్
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లతో ఒత్తిడి రహిత అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్‌తో మీ స్పేస్ ఎప్పటికీ మీకు సురక్షితమైన స్పేస్గానే ఉంటుంది. జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫీచర్లు యూజర్‌కు పూర్తి ప్రైవసీని, మనశ్శాంతిని అందిస్తాయి. స్మార్ట్‌ఫోన్లలో నిక్షిప్తమైన వ్యక్తిగత, వృత్తిగత డేటా అంతటినీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడాన్ని దృష్టిలో ఉంచుకుని నిల్వ చేయడం సవాళ్లతో కూడినదే. ఈ వినూత్న ఫీచర్లతో ఈ సమస్యను శాంసంగ్ దీటుగా పరిష్కరించింది. నేటి ప్రపంచంలో గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 నిజమైన ఆల్‌రౌండర్లుగా ముందుకొస్తున్నాయి. ఈ ఫోన్లతో జీవితాన్ని వినోదభరితంగా స్వేచ్ఛాయుతంగా మార్చుకోవచ్చు. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లను సొంతం చేసుకుంటే ఇక మీరు ఎన్నడూ వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. (Advertorial)

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు