రెండు స్మార్ట్‌ఫోన్లు.. అద్భుత కెమెరా (స్పాన్పర్డ్‌)

4 Oct, 2020 12:01 IST|Sakshi

వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై శాంసంగ్‌ పలు అప్‌డేట్స్‌ అందిస్తోంది. వీటిలో మీ గ్యాలరీ, వెబ్‌బ్రౌజర్‌, వాట్సాప్‌ వంటి యాప్స్‌ను ప్రైవేట్‌ నుంచి పబ్లిక్‌ మోడ్స్‌ మధ్య మార్చేందుకు వెసులుబాటు కల్పించే క్విక్‌ స్విచ్‌ కీలకమైనది.

ఫీచర్‌ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్‌ స్టూడియో 
మనం తీపిజ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, ఫ్రెండ్స్‌తో గేమ్స్‌ ఆడటం, ఓటీటీ కంటెంట్‌ వీక్షించడం, స్కూల్‌/వర్క్‌ కోసం వీడియో కాల్స్‌ మాట్లాడటం, నోట్స్‌ రాసుకోవడం వంటి పలు పనులను చక్కబెట్టేందుకు మనం స్మార్ట్‌ఫోన్‌లను వాడుతుంటాం. నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ స్మార్ట్‌ఫోన్‌లు మనకు ఉపకరిస్తున్నాయి

గేమింగ్‌, ఫోటోలను క్లిక్‌ చేయడం, ప్రొఫెషనల్‌ వర్క్‌ పూర్తి చేయడం వంటి అన్ని అవసరాలను నెరవేర్చేలా శాంసంగ్‌ గెలాక్సీ ఏ51, దీని బిగ్‌ బ్రదర్‌ గెలాక్సీ ఏ71అందుబాటులోకి వచ్చాయి. రెండు స్మార్ట్‌ఫోన్లు అద్భుతమైన స్క్రీన్‌, అత్యద్భుత కెమేరా, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ లైఫ్‌ అనుభవాన్ని మనకు అందస్తాయని శాంసంగ్‌ భరోసా ఇస్తోంది. 

►గెలాక్సీ ఏ51 ఈఏడాది తొలి క్వార్టర్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పరిశోధన సంస్థ స్ట్రేటజీ ఎనలిటిక్స్‌ వెల్లడించింది

►మరి వీటిలో ఇంకా మెరుగైన విషయం ఏంటంటే ఈ స్మార్ట్‌ఫోన్లతో మీరు మీ ప్రైవేట్‌ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచే అల్ట్‌ జడ్‌ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. 

అల్ట్‌ జడ్‌ జీవితం : ప్రైవసీకి ప్రాధాన్యం
నేటి ఆధునిక జీవితంలో జనరేషన్‌ జడ్‌, మిలీనియల్స్‌ వారి స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి పలు ప్రైవసీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్‌ అల్ట్‌ జడ్‌ జీవితానికి మార్గం సుగమం చేసింది. మీ ప్రైవసీపై ఎలాంటి ఆందోళనకు గురవకుండా గెలాకీ ఏ51, గెలాక్సీ ఏ71తో మీరు అన్ని ఫీచర్లను మీరు ఆస్వాదించవచ్చు. 
►మీ స్మార్ట్‌ఫోన్‌ను చూస్తామని మీ స్నేహితులు, సోదరులు అడిగిన ప్రతిసారీ ఎంతో అసౌకర్యంగా ఫీలవుతుంటా. వారు మీరు తీసిన ఓ ఫోటో కోసమో, మీరు సూచించిన గేమ్‌ను ఆడేందుకో వారు మీ స్మార్ట్‌ఫోన్‌ను అడిగినా మీరు కొంత అసౌకర్యానికి లోనవుతుంటారు.
►ఈ సమయాల్లో మీరు ఎలాంటి ఆందోళన, విచారం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను వారికి అందించే రెండు ఫీచర్లను శాంసంగ్‌ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ప్రవేశపెట్టింది. 
►క్విక్‌ స్విచ్‌ పేరుకు తగ్గట్టే మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు గ్యాలరీ, వాట్సాప్‌, ఇతర యాప్స్‌ను ప్రైవేట్‌ నుంచి పబ్లిక్‌ మోడ్‌లోకి వేగంగా మార్చేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. పవర్‌ బటన్‌ను రెండుసార్లు క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్‌లో మీరు ప్రెజెంటేషన్‌ ఇవ్వడం, మీ ఆఫీస్‌లో పార్టీకి సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులకు చూపే సందర్భాల్లో క్విక్‌ స్విచ్‌ మీకు మీ జీవితాన్ని కాపాడే కీలక ఫీచర్‌గా ముందుకొస్తుంది. 
►ఇక స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన ఏఐ ఆధారిత సొల్యూషన్‌గా ఇంటెలిజెంట్‌ సజెషన్స్‌ గ్యాలరీలో ప్రైవేట్‌ వెర్షన్‌లో భద్రంగా కాపాడే ఫోటోలను గుర్తించి సూచనలు చేస్తుంది. వారాంతం వెకేషన్‌ నుంచి నేరుగా ఆఫీస్‌కు వెళ్లడం​ వంటి పలు సందర్భాల్లో ఈ ఫీచర్‌ మీకు ఉపకరిస్తుంది. ప్రైవేట్‌గా ఉంచదలిచిన ఫోటోలు,ఇమేజ్‌లను మీరు ఎంపిక చేస్తే వాటిని ఎవరి కంటా పడకుండా ఏఐ మిగిలిన పని చక్కబెడుతుంది. 

ప్రముఖ వినూత్న ప్రైవసీ ఫీచర్లు
►నటి రాధికా మదన్‌ క్విక్‌ స్విచ్‌ పవర్‌ను ఉపయోగించి తన సోదరి (శిఖా తల్సానియ) ఆమె ఊహించిన దాని కంటే భిన్నమైనవి చూసేలా చేశారో గమనించవచ్చు
►ఫీచర్లను మరింత మెరుగ్గా అర్దం చేసుకోవడానికి వీడియోను వీక్షించండి
►ఈ తరహా ప్రైవసీని ఆస్వాదించేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు? గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్‌ఫోన్ల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో బహుళ భద్రత లేయర్‌లతో కూడిన శాంసంగ్‌ నాక్స్‌ భద్రతతో క్విక్‌ స్విచ్‌ రూపొందింది. 

విశిష్ట కెమెరా ఫీచర్లు
ఈ రెండు ఫోన్ల విశిష్ట కెమెరా ఫీచర్లను పరిశీలిద్దాం
►మీ ఫ్రెండ్‌ రన్నింగ్‌ రేస్‌ ఫోటోను సమగ్రంగా కెమెరాలో క్లిక్‌ చేయాలనుకుంటున్నారా? ఇండియా గేట్‌ వైడ్‌ యాంగిల్‌ షాట్‌ తీయాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్‌ పోర్ట్రయిట్‌ను కెమెరాలో బంధించాలనుకుంటున్నారా? ఆకుపై వాలిన కీటకాన్ని ఫోటో తీయాలనుకుంటున్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71తో ఇవన్నీ సాధ్యమే. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు తమ సొంతవైన క్వాడ్‌-కెమెరా సెటప్స్‌తో ముందుకొచ్చాయి.
►గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌ 48-మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సర్‌, 12-మెగాపిక్సెల్‌ వైడ్‌-యాంగిల్‌ కెమెరా, 5-మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సర్‌, 5-మెగాపిక్సెల్‌ మాక్రో కెమెరాతో ముందుకొచ్చింది. ముందుభాగంలో 32-మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
►ఇక గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్‌పై 64-మెగాపిక్సెల్‌ లెన్స్‌, 12-మెగాపిక్సెల్‌ అల్ర్టా-వైడ్‌ లెన్స్‌లు, 5-మెగాపిక్సెల్‌ మాక్రో కెమెరా, రియర్‌పై 5-మెగాపిక్సెల్‌ డెప్త్‌ కెమెరా, ముందుభాగంలో 32-మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 
►గెలాక్సీ ఎస్‌20 నుంచి అద్భుత కెమెరా ఫీచర్లను గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు శాంసంగ్‌ అందిస్తోంది. మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేసే ఫీచర్లను ఓసారి ప్రయత్నించండి

సింగిల్‌ టేక్‌ : ఇది గెలాక్సీ ఎస్‌20ల్లో ఉత్తమ ఫీచర్‌, ఇది ఇప్పుడు గెలాక్సీ ఏ51పై అందుబాటులో ఉండటం వినియోగదారులకు సంతోషకరమైన అంశం. సింగిల్‌ టేక్‌ ఫీచర్‌ 10 ఫోటోలు, వీడియోల వరకూ క్యాప్చర్‌ చేస్తుంది. సరైన ఫోటోను ఎలా ఫ్రేమ్‌ చేయాలని మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. కెమెరాను ఓపెన్‌ చేసి సింగిల్‌ టేక్‌ను సెలెక్ట్‌ చేస్తే సరిపోతుంది. 
►ఫోటోలను చూసేందుకు గ్యాలరీకి వెళ్లడం మామూలే. శాంసంగ్‌ సింగిల్‌ టేక్‌ ఫీచర్‌ మీ ఫోటోల్లో బెస్ట్‌ షాట్స్‌, మొమెంట్స్‌ను ఎంపిక చేసి వాటన్నింటినీ ఒక ఆల్బమ్‌లో అమర్చుతుంది. ఏఐని వాడుతూ మీరు షార్ట్‌ మూవీని, జీఐఎఫ్‌ యానిమేషన్స్‌ను, పలు స్టైలైజ్డ్‌ ఇమేజ్‌లను పొందవచ్చు.

నైట్‌ హైపర్‌లాప్స్‌ : పర్యాటకుడిగా నగరాన్ని చుట్టిరావడం గొప్ప అనుభూతి. ఆ క్షణాలను ఫోటోలుగా మలచి ఆ తర్వాత వాటిని చూసి మురిసిపోవడం​ మనందరం ఇష్టంతో చేసే పనే. ప్రజలు తమ సమయాన్ని ఆస్వాదించే వీడియోలను క్రియేట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించే హైపర్‌లాప్స్‌ ఫీచర్‌కు ఆదరణ పెరుగుతోంది
►శాంసంగ్‌ నైట్‌ హైపర్‌లాప్స్‌ ఫీచర్‌ ద్వారా గెలాక్సీ ఏ51పై హైపర్‌లాప్స్‌ వీడియోలు అర్ధరాత్రిలో క్యాప్చర్‌ చేసినా అత్యంత స్పష్టంగా, బ్రైట్‌గా ఉంటాయి. లాంగ్-ఎక్స్పోజర్ షాట్లను కాంతి, చలన మార్గాలతో వీడియో ఆర్ట్  పనిగా మార్చబడతాయి. 

కస్టమ్‌ ఫిల్టర్‌ : మీ ఫోటోలపై మీరు సొంతంగా వినూత్నంగా తీర్చిదిద్దుకునే నూతన పద్ధతిని ఇది అందుబాటులోకి తీసుకువస్తుంది. కలర్స్‌ను ఎంపిక చేసుకోవడం నుంచి భిన్నమైన షేడ్స్‌తో  కూడిన బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడం వరకూ మీకు వెసులుబాటు కల్పిస్తుంది. న్యూ కస్టమ్‌ ఫిల్టర్‌ మోడ్‌ మీకు విస్తృత ఊహాశక్తికి ఊతమిస్తుంది. 
స్మార్ట్‌ సెల్ఫీ యాంగిల్‌ : ఫ్రంట్‌ కెమెరాతో షూట్‌ చేస్తున్నప్పుడు ఫ్రేమ్‌లో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే కెమెరా తెలివిగా వైడ్‌ యాంగిల్‌ మోడ్‌లోకి వెళుతుంది. ప్రతిసారి అద్భుత సెల్ఫీలు తీసుకోవచ్చు.

క్విక్‌ వీడియో : కెమెరా బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయడం ద్వారా క్విక్‌ వీడియోను తీసుకోవచ్చు. వీడియో మోడ్‌ను పొందేందుకు సెట్టింగ్స్‌లో కుస్తీ పడుతూ వీడియో తీసే సమయాన్ని మిస్‌ అవడం వంటి రోజులకు కాలం చెల్లింది. మీ స్మార్ట్‌ఫోన్‌ తీసుకుని కెమెరా బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయడం ద్వారా ప్రత్యేక క్షణాలను వెంటనే రికార్డ్‌ చేయవచ్చు. మీ ఫ్రెండ్‌ రన్నింగ్‌ రేసు లేదా మీ బర్త్‌డే పార్టీలో మీ బంధువు పాట పాడటం వంటివి ఏవైనా వెంటనే వీడియో రికార్డు చేయవచ్చు.

రికార్డింగ్‌లో స్విచ్‌ కెమెరా : ఫ్రంట్‌ నుంచి రియర్‌ కెమెరాకు మారేందుకు రికార్డింగ్‌ను నిలిపివేయడం, మళ్లీ ఫ్రంట్‌ కెమెరాకు మారడం వంటివి ఏమంత సౌకర్యంగా ఉండవు. గెలాక్సీ ఏ51లో లభించే ఫీచర్‌తో మీ మధురమైన క్షణాలను ఎలాంటి అవాంతరం లేకుండా రికార్డింగ్‌ చేస్తూనే ఫ్రంట్‌, రియర్‌ కెమెరాలకు మారే వెసులుబాటు ఉంటుంది

ఏఐ గ్యాలరీ జూమ్‌: ఏఐ గ్యాలరీ జూమ్‌తో మీ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ తక్కువ రిజల్యూషన్‌ కలిగిన ఇమేజ్‌ల నాణ్యతను మెరుగుపరిచేందుకు అనుమతిస్తుంది. బ్లర్‌, పిక్సలేటెడ్‌ ఇమేజ్‌లను ఆర్ట్‌ వర్క్స్‌గా మెరుగుపరుస్తుంది

గెలాక్సీ ఏ51 గురించి మరిన్ని వివరాలు
►ఇది రెండు వెర్షన్‌లలో లభిస్తుంది
►6 జీబీ ర్యామ్‌ మరియు 128 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌ - రూ . 22,999
►8జీబీ ర్యామ్‌ మరియు 128జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌ - రూ . 24,499
►ఈ రెండు వెర్షన్‌లు ప్రిస్మ్‌ క్రష్‌ వైట్‌, ప్రిస్మ్‌ క్రష్‌ బ్లాక్‌, ప్రిస్మ్‌ క్రష్‌ బ్లూ, హేజ్‌ క్రష్‌ సిల్వర్‌ వంటి నాలుగు రంగుల్లో లభిస్తాయి. గెలాక్సీ ఏ51 కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటుంది. 
►గెలాక్సీ ఏ51 6.5 ఇంచ్‌ల సూపర్‌ అమోల్డ్‌ ఫుల్‌- హెచ్‌డీ+ (1080x2400 పిక్సెల్స్‌) డిస్‌ప్లేతో ముందుకొస్తోంది. ఆక్టా-కోర్‌ ఎక్సినాక్స్‌9611 ఎస్‌ఓసీ ఆధారిత పంచీ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మీరు మీ స్నేహితులు ఎలాంటి అసౌకర్యానికి లోనవకుండా ఫోటోలను, యూట్యూబ్‌ వీడియోలను వీక్షించదగిన గొప్ప వీక్షణా యాంగిల్స్‌తో కూడిన డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. 
►ఈ స్మార్ట్‌ఫోన్‌ 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 15వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో అందుబాటులో ఉంది. దీర్ఘకాలం గేమింగ్‌, అపరిమిత వాచింగ్‌ సెషన్స్‌కు సరిపడా చార్జింగ్‌ సామర్ధ్యం కలిగిఉంది. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఒన్‌ యూఐ 20  సాఫ్ట్‌వేర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్‌ రన్‌ అవుతుంది.

గెలాక్సీ ఏ 71పై ఇతర మెరుగైన ఫీచర్లు
►గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్‌ 6.7 ఇంచ్‌ల (1080x2400 పిక్సెల్స్‌) ఇన్ఫినిటీ-0 సూపర్‌ అమోల్డ్‌ ప‍్లస్‌ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730 ఓక్టా-కోర్‌ చిప్‌సెట్‌తో ముందుకొచ్చింది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో దైనందిన జీవితంలో భిన్నమైన టాస్క్‌లను నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తుంది.
►4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు 25వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కల్పిస్తుంది. గెలాక్సీ ఏ71 8జీబీ+128జీబీ వేరియంట్‌  ధర రూ . 29,499
►ఆకర్షణీయ ప్యాకేజ్‌, దీర్ఘకాల వీక్షణ, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ : రెండు స్మార్ట్‌ఫోన్లపై మొబైల్‌ సెషన్లు, ఫోటో షూట్లు ఆహ్లాదభరిత అనుభూతిని అందిస్తాయి. వాటిపై ఏ టాస్క్‌ను మీరు ప్రయత్నించినా విశ్వాసంతో వాటిని నిర్వర్తిస్తాయి. అంతేనా..మీ స్మార్ట్‌ఫోన్ గోప్యతను చెక్కుచెదరకుండా ఉంచడం గురించి మీరు ఇక బాధపడరు!

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు