లేక లేక ట్విన్స్‌ పుట్టారు..కానీ ఆ సంతోషం నిలవాలంటే!

16 Aug, 2022 13:30 IST|Sakshi

ఆస్తికి పేదలైనా, అమ్మా, నాన్న అనిపించుకోవాలని ప్రతీ జంట కోరుకుంటుంది. అలా లేక లేక...ఏడేళ్ల  ఎదురు చూపుల తరువాత గర్భం దాలిస్తే... అందులోనూ కడుపులో ఉన్నది ట్విన్స్‌ అని తెలిస్తే.. ఇంకా ఆనందం.  కానీ ఫాతిమా, జునైద్‌  కథ వేరే..అదేంటో ఒకసారి చూద్దాం..!

ఫాతిమా, జునైద్‌ ఇద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఆందోళన చెందారు.  ఇక లాభం లేదు  అని  నిరాశపడుతున్న సమయంలో వారి ప్రయత్నాలు ఫలించి ఫాతిమా గర్భం దాల్చింది.  దీంతో తమ  ఆశలు నెరవేరబోతున్నందుకు, అందులోనూ  కవలలకు జన్మనివ్వబోతున్నామని తెలిసి  ఫాతిమా జునైద్‌ జంట ఆనందానికి అవధుల్లేవు. 

కానీ సరిగ్గా మూడు నెలలైనా తిరగకుండానే ఆ సంతోషం కాస్తా ఆందోళనగా మారిపోయింది. పిల్లల ఎదుగుదల సరిగ్గా లేదు. అబార్షన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతేకాదు గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి కూడా ప్రమాదమని హెచ్చరించారు. అయినా ఫాతిమా, జునైద్‌ పెద్దసాహసమే చేశారు. ఎలాగైనా బిడ్డల్ని కనాలనే నిర్ణయించుకున్నారు. మొత్తానికి అలా  ఎనిమిదినెలలు గడిచాయి. ఒకరోజు విపరీతమైన కడుపునొప్పితో ఫాతిమా ఇబ్బంది పడింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆందోళనగా భర్త.

‘‘ఏమైంది’’ అని అడిగింది విచారంగా ఫాతిమా..కవలబిడ్డల్ని తలుచుకుంటూ..‘‘థ్యాంక్‌ గాడ్‌..నీకు గండం గడిచింది ఆ దేవుడు దయ వల్ల అతికష్టంమీద నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. మనకి ఇద్దరు కొడుకులు ఫాతిమా’’ అని చెప్పాడు ఉబికివస్తున్న కనీళ్లను అదుముకుంటూ. ‘‘కానీ ఇద్దరు వెంటిలేటర్‌పై NICUలో ఉన్నారు.డాక్లర్లు ఇంకా ఏ విషయమూ చెప్పడం లేదు’’ అన్నాడు నీరు నిండిన కళ్లను తుడుచుకుంటూ.

అలా దాదాపు నెల రోజులు గడిచిపోయింది. అయినా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నెలలు నిండకుండా పుట్టడం వల్ల వచ్చిన సమస్యలతో పిల్లలు పూర్తిగా కోలుకోవాలంటే సుమారు  10 లక్షలు ($ 12506.89) ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఖర్చుపెట్టారు. జునైద్‌ నెల సంపాదన  కేవలం 5 వేల రూపాయలుమాత్రమే. అయినా దాదాపు రెండు లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఒకవైపు సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే తన కుమారులను కాపాడుకునేందుకు దాతలు స్పందించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు ఫాతిమా జునైద్‌ దంపతులు.

ఇన్ని రోజులైనా బిడ్డలు ఇంకా కోలుకోలేదు.వారిని మనసారా గుండెలకు హత్తుకుని తడిమి చూసుకోలేదంటూ ఫాతిమా తల్లడిల్లిపోతోంది. నా కవల పిల్లల్ని కాపాడుకునేందుకు మీ మద్దతు చాలా అవసరం! దయచేసి నా కుటుంబాన్ని, నా మాతృత్వాన్ని, నా పిల్లలను రక్షించండి! వారి జీవితాలు మీచేతుల్లోనే.. దయచేసి మీకు వీలైనంత సాయం చేయండి అని ఫాతిమా ప్రార్థిస్తోంది.
(అడ్వర్టోరియల్‌) 

మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు