కవలలు పుట్టారన్న ఆనందం.. కానీ అంతలోనే..

20 Sep, 2021 14:51 IST|Sakshi

నా పేరు సఫీరా.. నా భర్త సేల్స్‌మ్యాన్‌గా పని చేసేవాడు. మాకు ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. కానీ కరోనా సంక్షోభం కారణంగా నా భర్త ఉద్యోగం పోయింది. ఈ బాధలో ఉన్న మాకు నేను రెండో సారి గర్భవతిని అయ్యానంటూ ఓ తీపి కబురు అందింది. ఆ వార్త వినగానే కష్టాల వెంటనే సంతోషాలు ఉంటాయనే మాటను నమ్మాకు. కానీ అంతలోనే ఊహించనది జరిగింది ?

అబార్షన్‌ తప్పదు ?
ప్రెగ్నెంట్‌ కావడంతో ప్రతీ నెల చెకప్‌ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లవాడు నా భర్త. కొంతకాలం తర్వాత నన్ను పరీక్షించిన డాక్టరు నాకో చేదు నిజం చెప్పారు. కడుపులో కవలలు ఉన్నారని, అయితే వారి పరిస్థితి బాగాలేదని అబార్షన్‌ చేయించుకోకుంటే తల్లి, బిడ్డలకు ప్రమాదమంటూ సూచించారు. పొత్తిళ్లలోనే పసికందులను చిదిమేయాలా లేక అల్లాపై దయ ఉంచి ముందుకు వెళ్లాలా అని మదనపడిపోయాను. చివరకు కష్టాల వెంటే సంతోషాలు ఉంటాయని నమ్ముతూ.. ఆ అల్లాపై భారంపై భారం వేసి అబార్షన్‌కి ఒప్పుకోలేదు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

గండం గడిచింది
డాక్టర్లు భయపడినట్టు కాన్పు సందర్భంగా నాకేమీ కాలేదు. కవలలుగా మగ పిల్లలు జన్మించారు. వారిద్దరి బోసి నవ్వులు మాలో మరోసారి సంతోషం నింపాయి. తన తమ్ముళ్లతో ఆడుకునేందుకు వాళ్ల అక్క కూడా ఆస్పత్రికి వచ్చింది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకునే తరుణంలో మరోసారి కష్టాలు వెంటాడాయి, సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌
డాక్టర్లు సూచించిన దాని కంటే చాలా ముందుగా కవలలు ఇద్దరు  నెలలు నిండకుండానే పుట్టారు. దీంతో సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకునేందుకు ఇద్దరు పసి పాపాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది వారికి ఉన్న సమస్యని రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ అని చెప్పారు. ప్రస్తుతం వాళ్లని ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి బిడ్డల ఆరోగ్యం మెరుగవ్వాలంటే కనీసం రెండు నెలలు ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందివ్వాలని డాక్టర్లు చెప్పారు. అందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

చిన్నారుల కోసం
ఆ చిన్నారులు ఈ లోకాన్ని చూడాలంటే వైద్య చికిత్సలు చేయించాలి. ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకున్న నా భర్త అంత డబ్బు సర్థుబాటు చేయలేడు. అందుకే మెడికల్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ రైజింగ్‌ సంస్థ కెట్టోని సంప్రదించాం. ఊపిరి తీసుకునేందుకు  పోరాడుతున్న ఆ చిన్నారులకు సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి. 
 

మరిన్ని వార్తలు