అమ్మా..! నేను మళ్లీ ఆడుకోగలనా? వాడికి ఆ భయంకర నిజం ఎలా చెప్పను?

28 Mar, 2022 13:46 IST|Sakshi

‘అమ్మా.. నేనింకా ఎన్నాళ్లు ఈ హాస్పిటల్‌లో ఉండాలి. ఇంటికెప్పుడు వెళ్దాం ? నా ఫ్రెండ్స్‌తో ఎప్పుడు ఆడుకోవాలి’ అంటూ నా కొడుకు అడుగుతుంటే జవాబు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. పక్కకు తిరిగి వాడికి కనిపించకుండా కన్నీళ్లు రాల్చడం తప్ప మరో దారి కనిపించడం లేదు. సరైన సహాయం అందకుంటే నా కొడుకు మళ్లీ ఇంటికి వెళ్లడం అనేది జరగదు. ఎందుకంటే వాడి ఒంట్లో ప్రాణాలు తోడేసే భయంకరమైన వ్యాధి ఉంది.

ఎనిమిది నెలల క్రితం జ్వరంగా ఉందనడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. మందులు వాడిన ఆరోగ్యం బాగు కాలేదు సరికదా.. రోజురోజుకి వాడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు సివియర్‌ ఎప్లాస్టిక్‌ అనీమియా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్టుగా చెప్పారు. బిడ్డను కాపాడుకునేందుకు మా ఎమ్మెల్యే దగ్గరికి పోయాం, ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టాం, తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేశాం. అంతా కలిపి ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశాం.

బిడ్డ ఆరోగ్యం బాగు కావాలంటే ఇంకా కొన్ని థెరపీలు చేయాలని దానికి రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలి పని చేస్తే నెలకు వచ్చే సంపాదన రూ.7000. ఆ డబ్బులు మా తిండికే సరిపోతాయి. ఇప్పుడు బిడ్డ ఆస్పత్రి ఖర్చుల కోసం పదిహేను లక్షల రూపాయలు తెచ్చే దారి మాకు కనిపించడం లేదు. 
సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

మరోవైపు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్న నా కొడుకు, ఇంటికెప్పుడు వెళ్దామంటూ అడిగినప్పుడల్లా.. బదులు చెప్పలేక నేను, నా భర్త రోదిస్తూనే ఉన్నాం. మా నిస్సహాయ స్థితి వల్ల నా బిడ్డ రోజురోజుకు చావుకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు వాడిని కాపాడేందుకు మానవతామూర్తులు సాయం కావాలి. నా కొడుకు భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయండి. చావుకు దగ్గరవుతున్న నా బిడ్డ ప్రాణాలకు కాపాడేందుకు అండగా నిలవండి. 


సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

>
మరిన్ని వార్తలు