తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యం

10 Mar, 2023 01:18 IST|Sakshi
బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

అరకులోయ రూరల్‌: ఏజెన్సీలో తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా తన సొంత నిధులతో శ్రీతల్లీబిడ్డల సురక్షశ్రీ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ తెలిపారు. స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మండలంలో 24 గంటలూ గర్భిణులు, శిశువులకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అరకు నియోజక వర్గంలో ప్రతి ఆడ పడుచుకు అన్నలా అండగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఇది అల్లూరి జిల్లాకే ఆదర్శం కానునుందన్నారు. తల్లీబిడ్డల సురక్ష కార్యక్రమం అమలులో మన్య ప్రగతి చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలందిస్తుందని చెప్పారు. గతంలో కూడా 803 మంది గర్భిణులకు మన్య ప్రగతి చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రసూతి సేవలందించిందని తెలిపారు. ప్రతి మండలానికీ ఇద్దరు చొప్పున వలంటీర్లను, రెండు ఆటోలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రసవానికి 15 రోజుల ముందే గర్భిణులను ఆస్పత్రిలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కల్చరల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు దిలీప్‌ కుమార్‌,యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌, మాజీ అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు,మండల కన్వీనర్‌ సంపత్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ రామన్న,నాయకులు తిరుపతి,శివ,నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

సొంత నిధులతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం

మరిన్ని వార్తలు