ఆధ్యాత్మిక శోభ

28 Mar, 2023 01:10 IST|Sakshi
● భక్తిశ్రద్ధలతో ధ్వజస్తంభాల ప్రతిష్ట ● తరలివచ్చిన భక్తులు

జి.మాడుగుల: చింతపల్లి మండలం కృష్ణాపురం పాకలపాడు గురుదేవులు, వైకుంఠ సీతారాముల దివ్య సన్నిధిలో సోమవారం ధ్వజస్తంభం, ఉత్సవమూర్తుల ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమం రామానంద స్వామిజీ, పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం అధ్యక్షుడు మత్స్య రాస మత్స్యరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ శ్రీరామనవమి వరకు శ్రీరామ నామ జప యజ్ఞం నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవ మూర్తుల భారీ ఊరేగింపు కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కృష్ణాపురంలో 30న జరగనున్న శ్రీ రామనవమి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ధ్వజస్తంభం ప్రతిష్టాపనలో భక్తులు పాల్గొన్నారు.

కొయ్యూరు: కొయ్యూరు కొండపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో సోమ వారం ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. వేద పండితుల మంత్రోఛరణల మద్య దువ్వా రమణారావు, కృష్ణవేణి దంపతులు ప్రతిష్టించారు. గడచిన వారం నుంచి ధ్వజస్తంభం ప్రతిష్టపై ప్రచారం చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆదివారం ఉదయం నుంచి హోమం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ ఆవరణలో ప్రతిష్టాపన అనంతరం భారీ అన్న సమరాధన ఏర్పాటు చేశారు. వందలాదిగా భక్తులు తరలివచ్చారు. అలయ కమిటీ సభ్యులు ప్రసాద్‌, చక్రరావు, సత్యనారాయణ, చిరంజీవి తదితరులు పర్యవేక్షించారు.

>
మరిన్ని వార్తలు