మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం

28 Mar, 2023 01:10 IST|Sakshi

పాడేరు రూరల్‌: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు అనుగుణంగానే మహిళల పేరిట సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పథకాలకు రూపకల్పన చేశారని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల సందర్భంగా పాడేరు పట్టణంలోని మోదకొండమ్మ ఆలయం ఆడిటోరియంలో సోమవారం సంబ రాలను ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వెలుగు అధికారులు, డ్వాక్రా సభ్యులు క్షీరాభిషేకం చేసి, థ్యాంక్యూ సీఎం సర్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. పాడేరు మండలంలోని 26 పంచాయతీల్లోని డ్వాక్రా సభ్యులకు మూడో విడత కింద మంజూరైన రూ.88,53,487 చెక్కును ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వెలుగు పీడీ మురళి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చి డ్వాక్రా సభ్యులను వంచించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైఎస్సార్‌ ఆసరా సొమ్ముతో మహిళలు వ్యాపారాలు చేసుకోవ డం సంతోషంగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నిక ల్లో కూడా వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉండి మరోసారి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్‌పర్సన్‌ సరస్వతి, పాడేరు ఎంపీపీ సొనారి రత్నకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూతంగి సూరిబాబు, పంచాయత్‌ రాజ్‌ విభాగ జిల్లా అధ్యక్షుడు గబ్బాడ చిట్టిబాబు, మండల మహిళ సమాఖ్య అధ్యక్షురాలు చిన్నారి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, మాజీ ఎంపీపీ సీదరి మంగ్లన్నదొర, ఎస్‌.వి. రమణ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

మరిన్ని వార్తలు