అనర్హుల పింఛన్లు రద్దు చేయాలి

28 Mar, 2023 01:10 IST|Sakshi
ప్రజావేదికలో వివరాలు తెలుసుకుంటున్న డ్వామా పీడీ రమేష్‌ రామన్‌

ఎటపాక: ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న అనర్హులను గుర్తించి, వారికి పెన్షన్‌ రద్దు చేయాలని డ్వామా పీడీ రమేష్‌రామన్‌ ఆదేశించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల తనిఖీల వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో వెల్లడించారు. రూ.9కోట్లతో చేపట్టిన 536 పనులను తనిఖీ చేసినట్టు చెప్పారు. వేతనదారులందరికీ సకాలంలో వేతనాలు అందించినట్టు ఆడిట్‌ బృందం తెలిపింది. పరిమితికి మించి భూమి ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు కూడా పింఛన్లు పొందుతున్నట్టు ఆడిట్‌లో తేలిందని బృందం వెల్లడించింది. అటువంటి వారిపై డీఆర్‌డీఏకు నివేదిక పంపనున్నట్టు పీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాక కామేశ్వరి, ఏపీడీవో విఠల్‌పాల్‌, ఏపీవో అరవాలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు