శిశుమరణాల నిరోధానికి ప్రత్యేక చర్యలు

29 Mar, 2023 01:24 IST|Sakshi
అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

సాక్షి,పాడేరు: జిల్లాలో శిశు మరణాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, వైద్య బృందాలను పంపేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని హామీ ఇచ్చారని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ తెలిపారు. ఇటీవల పలు గ్రామాల్లో చోటుచేసుకుంటున్న శిశు మరణాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆయన చెప్పారు. మంగళవారం విశాఖలో మంత్రిని కలిసి పెదబయలు మండలం కుంతుర్లలో ఇద్దరు శిశువులు మృతిచెందిన విషయంతో పాటు ఇతర ప్రాంతాల్లో శిశుమరణాల వివరాలను తెలియజేశానని తెలిపారు. వెంటనే స్పందించిన ఆమె వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌తో మాట్లాడి, శిశుమరణాల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. ఏజెన్సీలో శిశు ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు మంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పాల్గుణ తెలిపారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు