రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం

29 Mar, 2023 01:24 IST|Sakshi
శ్రీరామగిరి సుందర సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీ
● జిల్లా అంతటా నవమి సందడి ● ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు తలమునకలు

సాక్షి,పాడేరు: శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. వీఆర్‌ పురం మండలం శ్రీరామగిరి సుందర సీతారామచంద్రస్వామి వారి ఆలయంతో పాటు అన్ని దేవాలయాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాడేరు మండలంలోని సుండ్రుపుట్టు,డోకులూరు, రాములపుట్టు,దబ్బాపుట్టు,కొత్తూరు గ్రామాల్లోని రామాలయాల్లో పెళ్లిరాట కార్యక్రమంతో మంగళవారం ఉత్సవాలను ప్రారంభించారు.రాములపుట్టులో సర్పంచ్‌ గబ్బాడ చిట్టిబాబు,గ్రామపెద్దలు సుబ్బారావు,రంగారావు,నాగరాజుల ఆధ్వర్యంలో గిరిజనులు రామాలయంలో పూజలు జరిపారు.సుండ్రుపుట్టులో ఉత్సవాల ప్రారంభానికి అన్ని వర్గాల భక్తులు భారీగానే తరలివచ్చారు.

వీఆర్‌పురం: నవమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా బందోబస్తు నిర్వహించాలని చింతూరు ఏఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శ్రీరామగిరిలోని సుందర సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించనున్న నవమి ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం ఆయన పర్యవేక్షించారు. వేడుకలకు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, కల్యాణ సమయంలో ఏయే ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది అనే విషయాలను ఆలయ ప్రధాన అర్చకుడు సౌమిత్రి పురుషోత్తమాచార్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతర పార్కింగ్‌ ఏరియా, గోదావరి బోట్‌ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులుగ్యాస్‌ పొయ్యి లను తగిన రక్షణతో ఏర్పాటు చేసుకునేలా సూచనలు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. సీఐ గజేంద్ర, స్థానిక ఎస్‌ఐలు తెల్లం దుర్గాప్రసాద్‌,కూన వరం ఎస్‌ఐ బి.వెంకటేష్‌,సర్పంచ్‌ పులి సంతోష్‌ ,ఆలయ కమిటీ చైర్మెన్‌ రేవు బాలరాజు,సచివాలయ కన్వీనర్ల మండల ఇంచార్జ్‌ బొడ్డు సత్యనారాయణ , ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానీటరింగ్‌ కమిటీ సభ్యుడు చిక్కాల బాలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు