చింతూరు: బొడ్డుగూడెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన చిదంబర్ (60) మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు బొడ్డుగూడెంలోని బాలికల ఆశ్రమ పాఠశాల ఎదురుగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిదంబర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలు కావడంతో సమీపంలోని ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించారు. చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.