ముఖ్యమంత్రికి జీవితకాలం రుణపడి ఉంటాం

29 Mar, 2023 01:24 IST|Sakshi
మాట్లాడుతున్న సరస్వతి

కొయ్యూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవిత కాలం రుణపడి ఉంటామని దొడ్డవరానికి చెందిన కనిగిరి సరస్వతి తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సాయం ఎన్నటికి మరవలేమన్నారు. కొద్ది రోజుల కిందట పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎంపీపీ బడుగు రమేష్‌ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.4.5 లక్షల చెక్కును అందుకున్నామన్నారు.తన కొడుకు చంద్రశేఖర్‌ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం సచివాలయ కార్యదర్శిగా చేసే వారన్నారు. కిందటి సంవత్సరం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ద్వారా తెలియజేయడంతో స్పందించి ఆదుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి, ఎంపీపీ రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు