ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి

29 Mar, 2023 01:24 IST|Sakshi
సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

అరకులోయ రూరల్‌: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో పరిశుభ్రతపై ఆరా తీసి, రికార్డులు, వార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేందుకు కృషిచేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మన్యంలో శిశు మరణాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో గర్భిణుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు