ఏంటి? మొబైల్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేశారా.. మీక్కూడా ఇలా జరుగుతుందేమో.. జాగ్రత్త!

27 Oct, 2023 13:55 IST|Sakshi
కొరియర్‌ ద్వారా వచ్చిన సెల్‌ఫోన్‌ బాక్సులో రాళ్లు

ఆన్‌లైన్‌ ఆర్డర్‌ బుక్‌ చేసిన వినియోగదారుడికి చేదు అనుభవం!

మొబైల్‌కు బదులు రాళ్లు..

కనెక్టర్‌ లేని చార్జర్‌!

సాక్షి, అల్లూరి సీతారామరాజు: దసరా పండగ సందర్భంగా సెల్‌ఫోన్‌ కొనుక్కోవాలనుకున్న ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగికి చెందిన పండు అనే ఓ యువకుడు ఆఫర్‌లో రూ.6 వేలకు వస్తోందని ఇంటెల్‌– ఏ60ఎస్‌ సెల్‌ఫోన్‌ కోసం ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీకు ఆర్డర్‌ పెట్టాడు. సెల్‌ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్న అతనికి గురువారం కొరియర్‌ బాయ్‌ ఫోన్‌ వచ్చిందంటూ ఓ బాక్స్‌ అందజేశాడు.

ఆ యువకుడు ముందు జాగ్రత్తతో ఆ బాక్సును కొరియర్‌ బాయ్‌ ఎదురుగానే తెరిచాడు. తీరా ఆ బాక్సులో ఫోన్‌కు బదులు రెండు రాళ్లు, వైరు లేని చార్జర్‌ కనిపించడంతో అతనితోపాటు, ఇది చూసిన ఇరుగు పొరుగువారు అవాక్కయ్యారు. కొరియర్‌ బాయ్‌ వెంటనే సంబంధిత కొరియర్‌ కంపెనీకి ఫోన్‌ చేసి విషయం తెలియజేశాడు. ఆర్డర్‌ ప్రకారం సెల్‌ఫోన్‌ అందజేస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆ యువకుడు శాంతించాడు.

మరిన్ని వార్తలు