మెరుగైన వైద్యం అందించాలి

21 Nov, 2023 01:16 IST|Sakshi
రంపచోడవరం ఏరియా ఆస్పత్రినిసందర్శించిన డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కృష్ణారావు

రంపచోడవరం: మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.కృష్ణారావు సోమవారం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీటీసీఎం డాక్టర్‌ వి.విశ్వేశ్వరనాయుడు తదితరులున్నారు.

టీబీ కేంద్రం పరిశీలన

కూనవరం: కూనవరం సీహెచ్‌సీ కేంద్రంలోని టీబీ కేంద్రాన్ని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ విశ్వేశ్వరనాయడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్‌ లోని రికార్డులను తనిఖీచేశారు. అనంరతం సిబ్బందికి పలు సూచనలు చేశారు. కూనవరం రేఖపల్లి ప్రాంత వైద్యాధికారులు కె.సునీల్‌కుమార్‌ , ధనలక్ష్మీ, సూర్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు