సింహగిరికి ఉగాది శోభ

23 Mar, 2023 01:16 IST|Sakshi
నిత్యకల్యాణంలో పాల్గొన్న ఉభయదాతలు

సింహాచలం: సింహగిరి బుధవారం ఉగాది శోభను సంతరించుకుంది. శ్రీ శోభకృత్‌నామ సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని భక్తులు సింహగిరికి పోటెత్తారు. క్యూలో బారులు తీరి వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఉగాది సందర్భంగా స్వామివారి ఆలయంతో పాటు ఆస్థానమండపం..కల్యాణమండపాన్ని పుష్పాలతో అలంకరించారు. అలాగే భక్తులందరికీ దర్శనానంతరం ఉగాది పచ్చడి అందజేశారు. సింహగిరిపై ఉన్న త్రిపురాంతకస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగింది.

విశేషంగా నిత్య కల్యాణం

వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో ఉదయం 9.30 నుంచి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను వేదికపై అధిష్టంపజేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణం కమనీయంగా నిర్వహించారు. భక్తులకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు కె.కె.ప్రసాదాచార్యులు, అర్చకుడు శ్రీకాంతాచార్యులు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

విశేషంగా నిత్య కల్యాణం

భక్తులతో కిటకిటలాడిన అప్పన్న ఆలయం

మరిన్ని వార్తలు