కళలను కాపాడుకుందాం

23 Mar, 2023 01:16 IST|Sakshi

జోగినాయుడును సత్కరిస్తున్న డీసీసీబీ

చైర్‌పర్సన్‌ అనిత దంపతులు, తదితరులు

మాకవరపాలెం: తెలుగు కళలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి గౌతమి లలిత కళా శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పురస్కార వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత మాట్లాడుతూ కళలను ప్రోత్సహిస్తూ ఏటా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న లలిత కళా శిక్షణ కేంద్రం వారిని అభినందించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. ఈ వేడుకల్లో చిన్నారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి క్రియేటివ్‌ హెడ్‌ జోగినాయుడు, ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, నర్సీపట్నం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు, ఇమానుయేలు సంస్థ డైరెక్టర్‌ జీవన్‌రాయ్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేతలు భద్రాచలం, హరిబాబు ప్రసంగించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు, శేషగిరిరావు, సభ్యులు రఘురాజు, ఆదినారాయణ, రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు