చార్జింగ్‌లో ఉండగా ఫోన్‌కాల్‌

13 May, 2023 01:16 IST|Sakshi

నర్సీపట్నం: నర్సీపట్నం కోమటవీధికి చెందిన కె.లక్ష్మణ్‌ (25) విద్యుత్‌ షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. టౌన్‌ సీఐ ఎన్‌.గణేష్‌ కథనం... మృతుడు లక్ష్మణ్‌ శుభకార్యాల క్యాటరింగ్‌ బాయ్స్‌ను సరఫరా చేస్తుంటాడు. ఇంటి దగ్గర ఫోన్‌ చార్జింగ్‌లో ఉన్నప్పుడు కాల్‌ రావడంతో ఫోన్‌లో మాట్లాడుతుండగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌కు గురయ్యాడు. వెంటనే బంధువులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

నిపుణుల సూచనలివే..!
► మొబైల్‌ చార్జింగ్‌ అవుతుండగా వాడరాదు
► చార్జ్‌ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్‌ వేడెక్కుతుంది
► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది
► ఫోన్‌ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది
► బ్యాటరీ లైఫ్‌టైం తగ్గిపోయే అవకాశం ఉంది
► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది
► చార్జింగ్‌ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు
► తడి చేతులతో చార్జింగ్‌ పెట్టరాదు.. ఫోన్‌ వాడరాదు
► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్‌ పెడితే షాక్‌ కొట్టే చాన్స్‌ ఉంది.

Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్‌ఫోన్‌.. స్పందించిన కంపెనీ

మరిన్ని వార్తలు