అన్ని గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలు

15 Sep, 2023 07:02 IST|Sakshi

మామిడిపల్లిలో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కోఆర్డినేటర్‌ నాగలక్ష్మి

దేవరాపల్లి: అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని జగనన్న స్వచ్ఛ సంకల్ప ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్‌ నాగలక్ష్మి అన్నారు. దీనివల్ల పరిశుభ్రతతోపాటు పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. మండలంలోని మామిడిపల్లి, ములకలాపల్లి గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. వాటి పనితీరుపై స్థానిక పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని తామరబ్బ, తారువ, బోయిలకింతాడ, ఎన్‌.జి.నగరం, కె.ఎం.పాలెం, గరిశింగిలను పరిశుభ్రత గ్రామాలుగా గతంలో ఎంపిక చేయగా.. తాజాగా మామిడిపల్లిని ప్రకటించారు. ఈ గ్రామంలో పారిశుధ్యం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వహణపై సర్పంచ్‌ కర్రి సూరినాయుడును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇన్‌చార్జ్‌ ఈవోపీఆర్డీ జి.సంతోషి నిళిని, పంచాయతీ సెక్రటరీలు సుధాకర్‌బాబు, జామి అప్పారావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు