ఏపీలో అతిపెద్ద మెగా టౌన్‌షిప్‌ హర్మోని సిటీ

25 Feb, 2023 08:56 IST|Sakshi

రాప్తాడు: రాష్ట్రంలోనే అతి పెద్ద మెగా టౌన్‌షిప్‌గా హర్మోని సిటీని 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ సుధీర్‌ హసిజ పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న హర్మోని సిటీలో గోల్డెన్‌ గ్లోబ్‌ ఇన్‌ఫ్రా ఎండీ రవికుమార్‌ ఆధ్వర్యంలో హర్మోని సిటీలో నిర్మితమవుతున్న 40 మీటర్ల ఎత్తైన క్లాక్‌ టవర్‌, 15 అంతస్తుల సిగ్నేచర్‌ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌ను సుధీర్‌ హసిజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ సుధీర్‌ హసిజ మాట్లాడుతూ హార్మోని సిటీలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌, హస్పిటల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ మాల్‌, ఐటీ కంపెనీలు, ఓపెన్‌ ప్లాట్స్‌, విల్లాలు, అపార్ట్‌మెంట్లతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఇలాంటి సౌకర్యాలు బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా లేవన్నారు. గోల్డెన్‌ గ్లోబ్‌ ఇన్‌ఫ్రా ఎండీ రవికుమార్‌ మాట్లాడుతూ హర్మోని సిటీలో బెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌ షిప్‌ను కార్బన్‌ మొబైల్స్‌ చైర్మన్‌ సుధీర్‌ హసిజ సహకారంతో మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. స్టాటెడ్‌ మల్టిప్లెక్స్‌ అండ్‌ స్మాల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఐటీ పార్క్‌తో పాటు 15 ఫ్లోర్ల ఎతైన భవనాన్ని నిర్మించబోతున్నామన్నారు. ఇది మన రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ ప్రాజెక్టుగా నిలిచిపోతుందన్నారు. అలాగే బ్యూటిపుల్‌ క్లబ్‌ హౌస్‌ను నిర్మించబోతున్నానని, క్లబ్‌ హౌస్‌తో పాటు విల్లాస్‌, సెలబ్రెటీ హోమ్స్‌, క్లాసికల్‌ హోమ్స్‌తో అనంతపురం ప్రజలకు మంచి సదుపాయలతో బ్యూటిపుల్‌ ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు