భారీ క్రేన్‌ వచ్చేసిందోచ్‌!

27 Feb, 2023 01:08 IST|Sakshi

అనంతపురం సిటీ/క్రైం: అనంతపురానికి ఆదివారం ఓ భారీ క్రేన్‌ చేరుకుంది. దీనిని ప్రత్యేక వాహనంలో చైన్నె నుంచి తీసుకువచ్చారు. నగరంలోని టవర్‌క్లాక్‌ సమీపంలో చేపట్టిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.

ఈ క్రమంలో విద్యుత్‌ లైన్‌కు పైన గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం చైన్నె పోర్టు నుంచి 700 టన్నుల బరువున్న భారీ క్రేన్‌ను తెప్పించారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు అందగానే గడ్డర్లను ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయనున్నారు. అనంతరం 45 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసి జాతికి అంకింతమివ్వనున్నారు. ఈ అంశానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, స్థానిక రైల్వే అధికారులు పలుమార్లు చర్చించారు.sr

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు