-

వలస కూలీ మృతి

28 Nov, 2023 02:26 IST|Sakshi

కళ్యాణదుర్గం: బతుకు తెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ పని ప్రాంతంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. వివరాలు... కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామంలో ఓ రైతు పొలంలో పని కోసం రైల్వే కోడురుకు చెందిన మేసీ్త్ర శివయ్య ఆ ప్రాంతానికి చెందిన పది మంది కూలీలను పిలుచుకుని వచ్చాడు. సోమవారం ఉదయం పొలం పనిలో నిమగ్నమైన రైల్వే కోడూరు నివాసి శంకర్‌ (45) తనకు ఛాతిలో నొప్పిగా ఉందంటూ తెలపడంతో తోటి కూలీలు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి పిలుచుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శంకర్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు