శ్రీవారి దర్శనానికి 10 గంటలు

5 Sep, 2022 05:44 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. పది కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 

గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ రోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆ విధంగా భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరబోవని తెలియజేసింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

మరిన్ని వార్తలు