వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌ విడుదల

30 Nov, 2020 14:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ‘వంద రోజుల మహిళా మార్చ్‌ బ్రోచర్‌’ను విడుదల చేశారు. ‘నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్‌, ఇతర చట్టాలు, హెల్ప్‌లైన్‌ నంబర్లపై ...మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ’ నిర్వహించనున్నారు. వంద రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్‌ నేరాలపై మహిళా కమిషన్‌ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ ఆర్కే రోజా,  వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ సుయజ్‌ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు