కోవిడ్‌ బాధితుల కోసం 108 ఆస్పత్రులు

13 Apr, 2021 04:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ బాధితులకు సేవలందించే ఆస్పత్రుల సంఖ్య 108కి పెంచారు. మొదటి వేవ్‌ తగ్గిన అనంతరం కోవిడ్‌ బాధితుల కోసం 52 ఆస్పత్రులు అందుబాటులో ఉంచారు. ఇప్పుడు కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆస్పత్రుల సంఖ్యను పెంచినట్టు కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం వెల్లడించింది. మొత్తం 2,044 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

ఇందులో 446 పడకల్లో పేషెంట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఇవిగాకుండా ఆక్సిజన్‌ పడకలు 9,174 ఉండగా.. 1,930 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారని పేర్కొంది. సాధారణ పడకలు 4,145 ఉండగా.. 886 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారని, 3,259 పడకలు అందుబాటులో ఉన్నాయని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు