ఒడిశా నుంచి 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌

2 May, 2021 05:10 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని

కాకినాడ సిటీ: ఒడిశాలోని అంగూల్‌ నుంచి రాష్ట్రానికి 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను విమానాల ద్వారా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 25 శాతం మేర మెడికల్‌ ఆక్సిజన్‌ వృథా అవుతున్నట్లు తెలిసిందన్నారు. దీనిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఆక్సిజన్‌ పైపుల మరమ్మతులకు రూ.30 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటి వల్ల కోవిడ్‌ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఫీజుల విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు