రాష్ట్రంలో 1,551 బ్లాక్‌ఫంగస్‌ కేసులు

7 Jun, 2021 05:06 IST|Sakshi

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 374 కేసులు

అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు బ్లాక్‌ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) కేసులు 1,551 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 91 బ్లాక్‌ఫంగస్‌ కేసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ జబ్బుతో 98 మంది మృతిచెందారు. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 374 మ్యుకర్‌ మైకోసిస్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 22 కేసులున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నా కేవలం 32 బ్లాక్‌ఫంగస్‌ కేసులే నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులొచ్చాయి. బ్లాక్‌ఫంగస్‌తో మృతిచెందిన వారు అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 15 మంది ఉండగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఒక్కరు ఉన్నారు. 

మరిన్ని వార్తలు