హైదరాబాద్‌ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో..

15 Jan, 2023 11:43 IST|Sakshi

హైదరాబాద్‌ అల్లుడికి భీమవరం మామ అతిథి మర్యాద 

సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): గోదావరి జిల్లాలంటేనే వెటకారానికి, మమకారానికి పెట్టింది పేరు. గోదావరి వాసుల అతిథి మర్యాదలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి నాగభద్రిలక్ష్మీనారాయణ(బద్రి)–సంధ్య దంపతులు తమ అల్లుడు చవల పృథ్వీగుప్తకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 రకాల వంటలతో శనివారం విందు భోజనం పెట్టి అబ్బుర పరిచారు.

సేమ్యదద్దోజనం, పెసర పునుకుల పలావు, కొబ్బరి పలావు, పెసర వడలు, తమలపాకు బజ్జీ, వంకాయ బజ్జీ, స్వీట్స్‌లో శనగపప్పు బూరెలు, పాకం గారెలు, ఎర్రనూక హల్వా, ఆకు పకోడి, సగ్గుబియ్యం వడలు వంటి రకాలతో పాటు వివిధ పండ్లు, పొడులు, అప్పడాలు, వడియాలు, బిర్యానీలు, పచ్చళ్లు, వేపుళ్లు, పప్పు కూరలు, ఆకు కూరలతో పాటు పలు రకాల ఐస్‌క్రీమ్స్‌ వడ్డించగా, వీటిలో ఎక్కువ శాతం ఇంటిలోనే తయారు చేయించడం విశేషం.
చదవండి: ఎత్తిపోతలకు గట్టిమేలు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు  

మరిన్ని వార్తలు