20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి

24 Nov, 2022 05:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్‌ క్యాడర్‌ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్‌ను ఆమోదించింది. వారికి నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వడంతోపాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌ కుమార్‌గుప్తా బుధవారం ఉత్తర్వులిచ్చారు. 

బదిలీ అయిన 21 మంది నాన్‌ క్యాడర్‌ ఎస్పీల జాబితా ఇదీ..
(1) బి.లక్ష్మీనారాయణ.. ఎస్పీ(ఇంటెలిజెన్స్‌), (2) కేఎం మహేశ్వరరాజు.. ఎస్పీ(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో), పల్నాడు జిల్లా, (3)ఎ.సురేశ్‌బాబు.. ఎస్పీ(విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), (4)కె.శ్రీనివాసరావు.. డీసీపీ(ట్రాఫిక్‌), విజయవాడ (5) కె.శ్రీధర్‌.. ఎస్పీ(ఎస్‌ఐబీ), (6) కె.తిరుమలేశ్వరరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), (7) ఎం.సత్తిబాబు.. డీసీపీ, విజయవాడ, (8) ఎంవీ మాధవరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), (9) జె.రామమోహన్‌రావు.. జాయింట్‌ డైరెక్టర్, ఏసీబీ, (10) ఎన్‌.శ్రీదేవిరావు.. ఎస్పీ(ఇంటెలిజెన్స్‌), (11) ఇ.అశోక్‌కుమార్‌.. ఎస్పీ(ఇంటెలిజెన్స్‌), (12) ఎ.రమాదేవి.. జాయింట్‌ డైరెక్టర్, ఏసీబీ (13)కేజీవీ సరిత.. ఎస్పీ, సీఐడీ (14) కె.ఆనందరెడ్డి.. డీసీపీ, విశాఖపట్నం (15) కె.చక్రవర్తి.. ఎస్పీ, ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్, తిరుపతి (16) కె.ఈశ్వరరావు.. ఏడీసీ, గవర్నర్‌ (17) కె.చౌడేశ్వరి.. ఎస్‌ఆర్‌పీ, గుంతకల్‌(18) ఇ.సుప్రజ.. జాయింట్‌ డైరెక్టర్, ఏసీబీ(19) కేవీ శ్రీనివాసరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్, (20) కె.లావణ్యలక్ష్మి.. ఎస్పీ, ట్రాన్స్‌కో (21) ఎం.సుందరరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్‌ 

మరిన్ని వార్తలు