సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌

7 Oct, 2022 18:02 IST|Sakshi

సాక్షి, అమరావతి:  2021 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిశారు.  పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర‍్భంగా.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌కు మార్గనిర‍్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. వారికి ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పారు. 

ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌లో పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్‌ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్‌ శర్మ, అశుతోష్‌ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్‌ మీనా, సూరపాటి ప్రశాంత్‌ కుమార్‌లు ఉన్నారు.
ఇదీ చదవండి: మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు