ఏపీలో కొత్తగా 2,331 కరోనా కేసులు

7 Apr, 2021 20:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,812 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,331 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,13,274మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 853 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,92,736 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 11మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7,262 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 13,276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,53,02,583 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు