శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

16 Aug, 2022 05:30 IST|Sakshi
ఆలయం వెలుపల భక్తుల సందడి

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వీరికి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్‌మెంట్‌ల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలను టీటీడీ పంపిణీ చేస్తోంది.

ఆదివారం అర్ధరాత్రి వరకు 92,328 మంది స్వామిని దర్శించుకున్నారు. 52,969 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.36 కోట్లు వేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి క్యూలైన్‌ ఆస్థాన మండపం వద్దకు చేరుకుంది. అద్దె గదులు దొరకకపోవడంతో భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు. 

మరిన్ని వార్తలు