పాలిసెట్‌లో 37,978 సీట్లు భర్తీ

13 Oct, 2021 02:33 IST|Sakshi

తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి

18లోపు కళాశాలల్లో రిపోర్టింగ్‌కు అవకాశం

అదే రోజు నుంచి తరగతులు

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్‌–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్‌ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలిసెట్‌ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్‌ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్‌ జాబితాను శాప్‌కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. 

259 కాలేజీలు.. 69,810 సీట్లు
పాలిసెట్‌లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్‌ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. 

సీట్ల భర్తీ ఇలా.. 

మరిన్ని వార్తలు