ఈ నెల 14 వరకు ఆలయం మూసివేత

8 Aug, 2020 18:23 IST|Sakshi

39 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. ఇవాళ 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

అలాగే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరించడంతో అర్చకులు,సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.


 

మరిన్ని వార్తలు