ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ

27 Aug, 2021 18:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నకిలీ చలానాల కేసులో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు రూ.4.11 కోట్లు రివకరీ చేసినట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 26 మంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులను సస్పెండ్‌ చేశామన్నారు. ఇప్పటి వరకు 12 మంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. ఫేక్ చలనాలు సృష్టించకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ చేస్తామని తెలిపారు. క్యాష్ లెస్ వ్యవహారాల ద్వారా నకిలీలకు చెక్ పెడతామని రజత్ భార్గవ తెలిపారు.

ఇవీ చదవండి:
‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’
రాహుల్‌ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ

మరిన్ని వార్తలు