శ్రీశైలం డ్యామ్‌లో 4 గేట్లు ఎత్తి నీటి విడుదల

12 Oct, 2021 04:32 IST|Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌(మాచర్ల) /సత్రశాల (రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో నాలుగు గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల హంద్రీ నుంచి 1,79,728 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమవారం నాలుగు గేట్ల ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ మరో 64,615 క్యూసెక్కులను వదులుతున్నారు.

ప్రస్తుతం జలాశయంలో 214.8450 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. అలాగే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 10 క్రస్ట్‌గేట్ల ద్వారా 1,36,304 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం  నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 1,70,121 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు