తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి.. 

15 Jul, 2021 03:56 IST|Sakshi

కన్వర్షన్‌కు 557 డిగ్రీ కాలేజీల దరఖాస్తు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పలు కాలేజీలు తమ తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలికి దరఖాస్తులు సమర్పించాయి. 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటాయని, తెలుగు మాధ్యమ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి  ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈమేరకు ఈ నెల 12వ తేదీ గడువు ముగిసే సమయానికి రాష్ట్రంలోని 557 కాలేజీలు తాము నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేయాలని దరఖాస్తు చేశాయి. దీనితో పాటు విద్యార్థులు చేరని పలు కోర్సులను ఉపసంహరించుకుంటూ 111 కాలేజీలు దరఖాస్తు చేశాయి. రాష్ట్రంలో మొత్తం డిగ్రీ కాలేజీల్లో 154 ప్రభుత్వ పరిధిలో ఉండగా 111 కాలేజీలు ప్రైవేటు ఎయిడెడ్‌ కాలేజీలుగా కొనసాగుతున్నాయి. 1,022 ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలున్నాయి.    

మరిన్ని వార్తలు