వైజాగ్‌ పోర్టుకు 6 కనెక్టివిటీ ప్రాజెక్టులు

23 Nov, 2022 05:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గతిశక్తి పథకంలో భాగంగా పోర్టు కనెక్టివిటీ రహదారుల్లో వైజాగ్‌ పోర్టుకు 6 ప్రాజెక్టులను కేటాయించినట్టు పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు చెప్పారు.  విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో పోర్టు ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించే మారిటైమ్‌–2022 సదస్సు మంగళవారం ప్రారంభమైంది.

రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 35 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌(ఎంఎంఎల్‌పీ)లో భాగంగా విశాఖపట్నం లాజిస్టిక్‌ హబ్‌గా భాసిల్లుతుందని అశాభావం వ్యక్తం చేశారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన గతిశక్తి ద్వారా ప్రాజెక్టులు వేగవంతం అవుతాయన్నారు.

వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ అనూప్‌కుమార్‌ సత్పతి మాట్లాడుతూ.. పోర్టులు, రైల్వేలు పరస్పర సహకారంతో గతిశక్తి ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. డబ్లింగ్, ట్రిప్లింగ్‌ పనులు పూర్తి చేసి.. విశాఖపట్నం రైల్వే జంక్షన్‌ను శరవేగంగా అభివృద్ధి చేసే చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు వివరించారు.  

మరిన్ని వార్తలు