ఏపీ: ఒక్కరోజే 3,234 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌

27 Jul, 2020 18:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్‌ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16 లక్షల 86 వేల 446 మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 43,127 మందికి పరీక్షలు నిర్వహించగా.. 6,051 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా 49 మంది ‍ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,454కి చేరింది. మృతుల సంఖ్య 1090కి పెరిగింది. వైరస్‌ నుంచి కోలుకుని ఈరోజు 3,234 మంది డిశ్చార్జ్‌ అ‍య్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 49,558కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,701 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్‌బులెటెన్‌ విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు