సామాన్యుల్లో అసామాన్యులు

8 Jul, 2021 03:34 IST|Sakshi

6 కేటగిరీల్లో 62 వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్, అచీవ్‌మెంట్‌ అవార్డులు 

వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక

వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక

ఆగస్టు 14 లేదా 15న అవార్డుల ప్రదానం

ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను 2021 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్‌), వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్‌ మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఈ అవార్డులను ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసి ఈ ఏడాది ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలు రంగాల్లో వివిధ సంస్థలు, వ్యక్తులు సమాజానికి అందించిన సేవలను గుర్తించి పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ అవార్డులకు ఎంపిక చేశామని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు.. వివిధ శాఖాధికారులు, పలు సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్, అచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొన్నారు.

సుదీర్ఘ కసరత్తుతో ఎంపిక
తెలుగు వారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని కృష్ణమోహన్‌ తెలిపారు. వైఎస్సార్, సీఎం జగన్‌లది పేదవాడికి మేలు చేయాలనే ఫిలాసిఫీ అన్నారు. తెలుగువాడు అంటే నిండైన వ్యక్తిత్వం కలిగిన వారిలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు తగిన అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్‌ కమిటీ కొద్ది నెలలుగా విస్తృతమైన కసరత్తు చేసిందన్నారు. వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్, అచీవ్‌మెంట్‌ కింద 50 అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, 62 అవార్డులను ఇస్తోందని చెప్పారు. వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆగస్టు 14 లేదా 15వ తేదీన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని అయన పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి(రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవార్డులను ఇస్తున్నారని తెలిపారు. 6 కేటగీరీల కింద మొత్తం 62 అవార్డులను ప్రదానం చేయనున్నారని చెప్పారు. 
 
సంస్థలు (అన్నింటికీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు)
1) ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ ట్రస్ట్‌  – కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా
2) సీపీ బ్రౌన్‌ లైబ్రరీ – వైఎస్సార్‌ జిల్లా
3) సారస్వత నికేతన్‌ లైబ్రరీ    – వేటపాలెం, ప్రకాశం జిల్లా
4) శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ – అనంతపురం జిల్లా        
5) ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌     – వైఎస్సార్‌ జిల్లా 
6) రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌    – అనంతపురం
7) గౌతమి రీజినల్‌ లైబ్రరీ   – రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా
8) మహారాజాస్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌    – మ్యూజిక్‌ – విజయనగరం

రైతులు
1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్‌ టైమ్‌) – కడియం నర్సరీల వ్యవస్థాపకుడు
2) మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – శ్రీకాకుళం
3) «ఎం.సి.రామకృష్ణారెడ్డి        – అనంతపురం     
4) కొట్యాడ శ్రీనివాసరావు   – విజయనగరం
5) విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ – కృష్ణా
6) ఎం.బలరామిరెడ్డి  – వైఎస్సార్‌ జిల్లా    
7) ఎస్‌.రాఘవేంద్ర – చిత్తూరు
8) సెగ్గె కొండల్‌రావు – విశాఖపట్నం
9) ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫార్మింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌    – విశాఖపట్నం
10) వల్లూరు రవికుమార్‌ – కృష్ణా
11) శివ అభిరామరెడ్డి – నెల్లూరు

కళాకారులు
1) పొందూరు వస్త్రాలు – ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం – శ్రీకాకుళం – లైఫ్‌ టైం
2) జానపద గేయం –  దివంగత వంగపండు ప్రసాదరావు–  విజయనగరం – లైఫ్‌ టైం 
3) బొబ్బిలి వీణ –  బొబ్బిలి వీణ కేంద్రం (అచ్చుత నారాయణ)–  విజయనగరం – లైఫ్‌ టైం 
4) రంగస్థలం –  పొన్నాల రామసుబ్బారెడ్డి – నెల్లూరు – లైఫ్‌ టైం 
5) సురభి నాటకం – (శ్రీ వినాయక నాట్య మండలి) – సురభి డ్రామా –  వైఎస్సార్‌ జిల్లా – లైఫ్‌ టైం 
6) లెదర్‌ పప్పెట్రీ –  దాలవాయి చలపతి –అనంతపురం –  లైఫ్‌ టైం 
7) కూచిపూడి నాట్యం – సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం – కూచిపూడి, కృష్ణా జిల్లా – లైఫ్‌ టైం
8) «ధింసా నృత్యం–  కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం – విశాఖపట్నం
9)  సవర పెయింటింగ్స్‌    –  సవర రాజు –  శ్రీకాకుళం
10)  వీధి నాటకం –  మజ్జి శ్రీనివాసరావు    – విశాఖపట్నం
11) డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ – ధర్మాడి సత్యం– తూర్పు గోదావరి
12) హరికథ–  సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) – తూర్పు గోదావరి
13) బుర్రకథ–  మిరియాల అప్పారావు    – పశ్చిమ గోదావరి
14) కొండపల్లి బొమ్మలు – కూరెళ్ల వెంకటాచారి– కృష్ణా
15) డప్పు కళాకారుడు – గోచిపాత గాలేబు–కృష్ణా
16) వెంకటగిరి జమదానీ చీరలు – జి.రమణయ్య– నెల్లూరు
17) కలంకారీ పెయింటింగ్స్‌–  శివప్రసాదరెడ్డి– కర్నూలు    
18) ఉడ్‌ కార్వింగ్స్‌ –  బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్జిజాన్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ –  చిత్తూరు
19) నాదస్వరం – డాక్టర్‌ వి.సత్యనారాయణ – చిత్తూరు
20) కేలిగ్రఫీ – పూసపాటి పరమేశ్వరరాజు – విజయనగరం

రచయితలు (అందరికీ లైఫ్‌ టైం)
1) స్వర్గీయ కాళిపట్నం రామారావు (కారా మాస్టర్‌)–  శ్రీకాకుళం        
2) కత్తి పద్మారావు    – అభ్యుదయ సాహిత్యం    – గుంటూరు
3) రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి– సాహిత్యం – వైఎస్సార్‌ జిల్లా
4) బండి నారాయణస్వామి    – సాహిత్యం– అనంతపురం
5) కేతు విశ్వనాథరెడ్డి    – సాహిత్యం – వైఎస్సార్‌ జిల్లా
6) కొనకలూరి ఇనాక్‌    – సాహిత్యం, గుంటూరు
7) శ్రీమతి లలితకుమారి (ఓల్గా) – సాహిత్యం– గుంటూరు

పాత్రికేయులు (అందరికీ లైఫ్‌ టైం)
1) పాలగుమ్మి సాయినాథ్‌ – చెన్నై 
2) ఏబీకే ప్రసాద్‌ – కృష్ణా
3) దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు
4) దివంగత షేక్‌ ఖాజా హుస్సేన్‌ (దేవీప్రియ)  – గుంటూరు
5) దివంగత కె.అమర్‌నాథ్‌ – పశ్చిమ గోదావరి
6) సురేంద్ర – కార్టూనిస్ట్‌ – కడప
7) తెలకపల్లి రవి – కర్నూలు
8) ఇమామ్‌ – అనంతపురం

కోవిడ్‌ వారియర్స్‌
1) డాక్టర్‌ నీతిచంద్ర – ప్రొఫెసర్‌ పల్మనాలజీ – నెల్లూరు
2) డాక్టర్‌ కె.కృష్ణకిషోర్‌  – ప్రొఫెసర్‌ ఈఎన్‌టీ – కాకినాడ
3) లక్ష్మి – స్టాఫ్‌ నర్స్‌ – జీజీహెచ్, విజయవాడ
4) కె.జ్యోతిర్మయి – స్టాఫ్‌ నర్స్‌    – అనంతపురం
5) తురుబిల్లి తేజస్వి – స్టాఫ్‌ నర్స్‌ – విశాఖపట్నం
6) ఎం.యోబు – మేల్‌ నర్సింగ్‌  – నెల్లూరు
7) అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ – గుంటూరు
8) ఆర్తి హోమ్స్‌ – వైఎస్సార్‌ కడప    

మరిన్ని వార్తలు