నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా...

3 Jan, 2022 08:02 IST|Sakshi

పింఛన్‌ పెంపుపై ఓ వృద్ధురాలి మనోగతం.. సోషల్‌ మీడియాలో వైరల్‌

పుట్లూరు: ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా..’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం వృద్ధులకు అందించే పింఛను మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి  చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రక్క.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. జై జగన్‌..జైజై జగన్‌ అంటూ ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా.. చక్కని తండ్రి.. బంగారు తండ్రి.. మా కోసమే జన్మించినావు..’ అంటూ ఎర్రక్క సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త చనిపోవడంతో గరుగుచింతలపల్లి అంబేడ్కర్‌ కాలనీలో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్‌ మాత్రమే ఆమెకు జీవనాధారం. పెరిగిన పింఛన్‌ అందుకున్న ఎర్రక్క తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

చదవండి: 82 శాతం లబ్ధిదారులకు పింఛన్‌

AP: టీనేజ్‌కు టీకా


 

మరిన్ని వార్తలు