వైఎస్‌ జగన్‌ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారు

15 Aug, 2020 10:25 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ..

'నవరత్నాలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేదల సంకేమానికి పాటుపడుతున్నారు. జిల్లాలో రూ.211 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నాం. జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం. కరోనా నివారణకు కోవిడ్ ఆసుపత్రుల్లో అధునాతన వసతులు కల్పిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం' అని మంత్రి సుచరిత తన ప్రసంగంలో వివరించారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఏ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ పాల్గొన్నారు. (ఆ ఘనత సీఎం జగన్‌దే: మంత్రి సురేష్‌)

మరిన్ని వార్తలు