పులిచింతలకు 7,635 క్యూసెక్కుల నీరు విడుదల 

30 Aug, 2021 04:59 IST|Sakshi
నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ రిజర్వాయర్‌

సత్రశాల (రెంటచింతల): గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద ఉన్న నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు 7,635 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్‌ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువనున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు మూసివేయడంతోపాటు 8 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేశారని పేర్కొన్నారు.

సత్రశాల నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు 20 క్రస్ట్‌గేట్లు మూసి రెండు యూనిట్ల ద్వారా 43.8 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన అనంతరం 7,635 క్యూసెక్కులను పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 75.17 మీటర్ల నీరుందని తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 7.080 టీఎంసీలుకాగా 6.841 టీఎంసీల నీరుందని తెలిపారు. గత 24 గంటల్లో 1.0522 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు మొత్తం 25.796 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పాదన చేసినట్లు 
తెలిపారు.  

మరిన్ని వార్తలు