ఏపీలో కొత్తగా 7,796  కరోనా కేసులు.. 

8 Jun, 2021 17:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 7,796 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,641 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌  అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 51 వేల 790 డిశ్చార్జ్‌ అయ్యారు.

గత 24 గంటల్లో కరోనా బారినపడి 77 మంది మరణించారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో 12, ప.గో.జిల్లాలో 10, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, తూ.గో.జిల్లాలో ఆరుగురు, విశాఖ జిల్లాలో ఆరుగురు, విజయనగరం జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 11629 మంది మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 1,99,46,253 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు
శ్రీకాకుళం- 376, విజయనగరం- 299, విశాఖ- 672, తూ.గో- 1302, ప.గో- 755, కృష్ణా- 379, గుంటూరు- 518, ప్రకాశం- 499, నెల్లూరు- 311, చిత్తూరు- 1210, అనంతపురం- 918, కర్నూలు- 147, వైఎస్ఆర్ జిల్లా- 410 కేసులు.

చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం 
జగనన్న తోడు: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు