‘చంద్రగిరి’లో 84% ఓట్లు వైఎస్సార్‌సీపీ అభిమానికే

25 Feb, 2021 04:52 IST|Sakshi
సర్పంచ్‌ రూప, వార్డు సభ్యులను అభినందిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ అభిమాని రికార్డుస్థాయిలో ఓట్లు సాధించారు. మొత్తం చెల్లిన ఓట్లలో దాదాపు 84 శాతం ఆమెకే వచ్చాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా వైఎస్సార్‌సీపీ అభిమాని ముద్దికుప్పం రూప.. టీడీపీ మద్దతుదారుగా పోటీచేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బాపనపట్టు అమ్ములుపై 5,751 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పంచాయతీలో మొత్తం 8,987 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 198 ఓట్లు చెల్లలేదు. 116 ఓట్లు నోటాకు పడ్డాయి. మిగిలిన 8,673 ఓట్లలో రూపకు 7,212 ఓట్లు (దాదాపు 84 శాతం) వచ్చాయి. మొత్తం 18 వార్డుల్లోను వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలిచారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి అభివృద్ధికి చేపట్టిన పనులతో వైఎస్సార్‌సీపీకి ప్రజలు మద్దతుగా నిలిచారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు