కరోనాను జయించిన '9 రోజుల చిన్నారి'

1 Jun, 2021 05:23 IST|Sakshi
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న డాక్టర్‌ సునీల్‌ కిశోర్, సిబ్బంది

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా నుంచి తొమ్మిది రోజుల పసికందును విశాఖ వైద్యులు రక్షించారు. 26 రోజుల చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి చేశారు. శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న 9 రోజుల పసిబిడ్డను మెడికవర్‌ ఆస్పత్రికి చిన్నారి తల్లిదండ్రులు 26 రోజులు కిందట తీసుకువచ్చారని మెడికవర్‌ ఆస్పత్రి డాక్టర్‌ సాయి సునీల్‌ కిశోర్‌ చెప్పారు.

పసిబిడ్డను పరీక్షించగా కోవిడ్‌ నిర్ధారణ అయ్యిందని 7 రోజుల పాటు చికిత్స అందించగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గిందని వివరించారు. అనంతరం మరో 19 రోజులపాటు చికిత్స అందించగా పాప పూర్తిగా కోలుకుందని చెప్పారు. తమ బిడ్డను కరోనా నుంచి రక్షించినందుకు వారి తల్లిదండ్రులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు