ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు...

27 Mar, 2021 16:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా, 947 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,97,810 మంది  కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 377 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,85,892 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్పటివరకు కరోనా సోకి 7,203 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 4,715 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 1,49,58,897 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి:
సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్‌
60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు

మరిన్ని వార్తలు